Collector Dr. Sathya Sharada : జిల్లాలో లక్ష 29 వేల 542 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 94 .16 కోట్ల రైతు భరోసా నిధులు జమ: కలెక్టర్ డాక్టర్ సత్య శారద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా పథకం లో భాగంగా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని, ఇందులో భాగంగా వానాకాలం 2025 కి సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు లక్ష 29 వేల 542 మంది రైతు ఖాతాల్లో 94 కోట్ల 16 రూపాయలు రైతు భరోసా నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేడోక ప్రకటన లో తెలిపారు
జిల్లాలో 1,65 109 మంది రైతులకు 166 కోట్ల 33 లక్షల రూపాయల నిధులు విడుదల చేయుటకు గాను రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ నందు పొందు పరచడం జరిగిందని తెలిపారు.
మంగళవారం సాయంత్రం నాటికి లక్ష 29 వేల 542 మంది రైతు ఖాతాల్లో 94 కోట్ల 16 లక్షల రూపాయలు
జమ చేయడం జరిగిందని, మిగతా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి వారి ఖాతాలలో జమ చేయనుందని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. కాగా, ఇచ్చిన హామీ మేరకు వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందించడం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.