SR university : విద్యార్థులకు ప్లేస్ మెంట్ చూపడంలో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రస్థానం లో నిలుస్తుందని యూని వర్సిటీ చాన్సలర్ ఎ. వరదా రెడ్డి అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్ – 2026 ఎస్సార్ యూని వర్సిటీ ప్రాంగణంలో శని వారం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స లర్ ఎ. వరదా రెడ్డి, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ ,డీన్ – ఆపరేషన్స్ & గ్రోత్ డాక్టర్ ఆర్. అర్చనా రెడ్డి, మరియు ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్స్ అసోసియేట్ డైరెక్టర్ జి. సునీల్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్య క్రమంలో ప్రో, చాన్సలర్, ప్రో, వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, డీన్లు, హెడ్‌లు, డైరెక్టర్లు, ఫ్యాకల్టీ సభ్యు లు, తల్లిదండ్రులు, ప్లేస్ అయిన విద్యార్థులు మరియు యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ రెడ్డి ప్లేస్‌మెంట్ నివేదిక ను అందిస్తూ, 1300కు పైగా విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. ఇంకా కొన్ని కంపెనీల నియామక ప్రక్రియ కొనసా గుతున్నందున ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. అదనంగా, విద్యార్థులు 1500కు పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలు సాధించారని తెలిపారు. అత్యధిక ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ నెలకు 1.1 లక్షలు, అలాగే అత్యధిక ప్యాకేజీ 44 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొ న్నారు. ప్రముఖ కంపెనీ లలో యాక్సెంచర్ లో 254 మంది, కాగ్నిజెంట్ లో 165 మంది, క్యాప్ జెమినీ లో 57 మంది ఎంపికయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ , టీసీఎస్, డెలాయిట్ , బీఎన్‌పీ పారిబాస్ వంటి ప్రముఖ సంస్థల్లో కూడా విద్యార్థు లు అవకాశాలు పొందారు ఇంకా మేనేజ్ మెంట్, కోర్ ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చర్ రంగాల్లో కూడా విశేష విజయాలు సాధించారు. ముఖ్యంగా డెలా యిట్ , ఐడిబిఐ బ్యాంక్ , డెల్టాఎక్స్ , క్వాడ్రంట్ టెక్నాలజీస్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ , ఓయాసిస్ ఆటోమేషన్ , బెర్గర్ పెయింట్స్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ , ఏషియన్ పెయింట్స్, బ్లూ స్టార్ వంటి సంస్థల్లో అవకాశాలు లభించాయి. అగ్రికల్చర్ రంగంలో కూడా విద్యార్థులు ప్రతిభ కనబరిచి, సింజెంటా, బేయర్ క్రాప్ సైన్స్, వీఎన్‌ఆర్ సీడ్స్ , అక్షయ కల్పా, ఐపీఎల్ బయో లాజికల్స్,మహికో వంటి సంస్థల్లో ఇంటర్న్ షిప్ అవకాశాలు పొందారు.
ఈ సందర్భంగా చాన్సలర్ ఎ. వరదా రెడ్డి విద్యార్థు లను అభినందిస్తూ, ఈ విజయాలు క్రమశిక్షణ, కృషి మరియు సరైన మార్గదర్శకత్వం.. ఫలిత మని పేర్కొన్నారు. విద్యా ర్థులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ, కొత్త సాంకే తికతలను ఆచరణలో పెట్టి,పరిశ్రమ అవసరా లకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్, విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన మరియు ప్రొఫెషనల్ విలువలను పెంపొందిం చుకోవాలని సూచించారు. అలాగే గ్లోబల్ స్థాయిలో పోటీపడేందుకు అవసర మైన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. డాక్టర్ ఆర్. అర్చనా రెడ్డి, ఫ్యాకల్టీ మరియు ప్లేస్ మెంట్ టీమ్ కృషిని అభినందిస్తూ, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కెరీర్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
