CP Sunpreet singh : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఈ ఏడాది జనవరి 28వ తేదీన మరణించిన కానిస్టేబుల్ వెంకటరమణ కుటుంబానికి పోలీస్ భద్రత విభాగం మంజూరు చేసిన 7లక్షల72వేల637రూపాయల చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా చెక్కును మరణించిన కానిస్టేబుల్ భార్య వాణి అందజేశారు. ప్రస్తుతం మరణించిన కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులపై పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమం అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ రామాదేవి పాల్గొన్నారు.