February 26, 2026

Sammakka-Saralamma Festival : సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేద్దాం

Sammakka-Saralamma Festival : పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేసి మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ను విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. జనవరి చివరి వారంలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర వరంగల్ పోలీస్ కమిషనర్కు ట్రాఫిక్ బందోబస్త్ బాధ్యతలు అప్పగించడంతో, వరంగల్ సీపీ కమిషనరేట్ కు చెందిన డిసిపి, అదనపు డిసిపి ఏసీపీ లతో హన్మకొండ జిల్లా కేంద్రం నుండి జాతర జరిగే ప్రదేశం జరిగే ప్రధాన రోడ్డు మార్గాన్ని సీపీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ మార్గం లో వాహన పార్కింగ్, హోల్డింగ్, ట్రాఫిక్ సమస్య లు తలెట్టే ప్రదేశాల్లో ఏర్పాటు బందోబస్త్ సీపీ క్షేత్ర స్థాయిలో సమీక్షా జరిపారు. అనంతరం సీపీ గట్టమ్మ గుట్ట వద్ద ఆర్టీసీ బస్సు లు, ప్రవైట్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలతో పాటు,జాతర ప్రదేశాన్ని చేరుకునే మార్గాలు, అలాగే ట్రాఫిక్ సమస్య తలెట్టినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై సీపీ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న సీపీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *