Government Schools : పాఠశాల తరగతి గదులు తెరుచుకోకముందే పాఠశాలకు పాఠ్యపుస్తకాలు దుస్తులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న గొప్ప కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా జయగిరి MPPS ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు . విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే అది చదువుతోన మాత్రమే సాధ్యమవుతుందని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు.
నేటి నుండి ప్రభుత్వ పాఠశాలలో బడులు పున ప్రారంభం సందర్భంగా హసన్పర్తి మండల పరిధిలోని జయగిరి MPPS ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే నాగరాజు అందజేశారు.
అనంతరం పాఠశాల మౌలిక సదుపాయాల కోసం ప్రహరీ గోడ మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందించారు. అదేవిధంగా పాఠశాలకు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేసిన ఉపాధ్యాయునికి మరియు సహకరించిన తల్లిదండ్రులను ఎమ్మెల్యే నాగరాజు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు పాఠశాల తరగతి గదులు తెరుచుకోకముందే పాఠశాలకు విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు విద్యార్థినీ విద్యార్థులకు దుస్తులను పాఠశాలకు చేర్చిందని ఇది విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రత్యేక దృష్టికి నిదర్శనమన్నారు వర్ధన్నపేట నియోజకవర్గంలో పేద విద్యార్థులకు భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అందరి సహాయ సహకారాలతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులు జరుగుతుందన్నారు.
ఇక విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పోవద్దని అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యను అందిస్తున్నారని కాబట్టి ప్రైవేటు పాఠశాలలో పది అక్షరాలు నేర్చుకున్న అంతే ప్రభుత్వ పాఠశాలలో రెండు అక్షరాలు నేర్చుకున్న దానితో సమానమని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నరు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని కాబట్టి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పోవద్దని రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పోటీతత్వం ఉంటుందని ప్రైవేటు బడులను ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడకుండా ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు రావాలని సూచించారు. మన వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను చెడు మార్గంలో గంజాయి చెడు వచనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ ఉండాలని అలాగే వారి విద్యా విధానాన్ని గమనిస్తూ ఉపాధ్యాయులకు వివరణ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి అనేక పాఠశాలలో ప్రహరీ గోడ మరుగుదొడ్లు త్వరలోనే నా సిడిఎఫ్ ఎదురునుంచి కేటాయించి పనులు పూర్తిచేసే పాఠశాలను అన్ని వసతులు కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.