Environmental Protection : ఏవి వి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో “మట్టి ప్రతిమలను పూజిద్దాం. పర్యావరణహిత ప్రేమికులనవుదాం” అనే పర్యావరణ పరిరక్షణ ర్యాలీని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ రతన్ సింగ్ ఠాకూర్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వినాయకుడు అంటేనే ప్రకృతి కావున మట్టి వినాయకుల మరియు రసాయన రహిత రంగులను వాడి తద్వారా జల కాలుష్యాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కొడిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏవీవి కళాశాల ఎన్ఎస్ఎస్ గత 20 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని ప్రజలలో మార్పు వస్తుందని మట్టి వినాయకుల తయారీ చాలా పెరుగుతుందని ఇది ప్రస్తుతం 25% ఉన్నదని రానున్న రోజుల్లో 40% కావాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే విద్యార్థులచే మట్టి వినాయకులను తయారుచేసి ర్యాలీ నిర్వహించడం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం” పిఓపి వద్దు మట్టి వినాయకులే ముద్దు “నినాదంతో పిఓపి మరియు భూమిలో కాలువని వ్యర్ధాన్ని రసాయన రంగులను చెరువులు సరస్సులలో కలువకుండా చూద్దాం మరియు మట్టి వినాయకుల వల్ల కలుగు లాభాలను ప్రజలకు తెలియజేస్తూ గణేష్ పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రిలు వాటి ఔషధ గుణములతో సర్వ రోగాలు పోతాయని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగినది. అనంతరం అనంతరం శ్రీనివాసరావు తయారుచేసిన ఔషధ మొక్కల విలువలకు సంబంధించిన గోడిపత్రికను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రిటైర్ అధ్యాపకుడు సర్వేశంగారు, సీనియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రబ్బాని, దేవిశ్రీప్రసాద్, సాకేత్, చిరంజీవి, దస్తగిరి, క్రాంతి ,భరత్ ,శివశంకర్ నమ్రత , చందన ,ప్రవళిక, మన్విత, సుహన,వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.