Warangal Roads : వరంగల్ బట్టల బజార్ బ్రిడ్జ్ పైన రోడ్డు గుంతలు ఏర్పడ్డాయి. ఈ రహదారిపై నిత్యం పెద్ద పెద్ద వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల కారణంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాహనాలు పాడై పోతున్నాయని ఇక్కడి స్థానికులు తెలిపారు. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు ఖమ్మం వైపు వెళ్తుంటాయని స్థానికులు తెలిపారు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో గుంతలలో నీరు నిల్వ ఉండటం ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..