August 28, 2025

BC Welfare Association : బీసీలపై.. రాజకీయ పార్టీలది సవతి తల్లి ప్రేమ..

BC Welfare Association : బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు ఇచ్చేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తా మని, గల్లి నుండి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఉద్యమి స్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిం చారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అధ్యక్షతన హన్మకొండ ఫాతిమానగర్ వైష్ణవి గ్రాండ్ హోటల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – బీసీల రిజర్వేషన్ల పెంపు అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరో పించారు. నెల రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయిం చి ఎన్నికల సంఘానికి నివేదించాలని, హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టడం లేదన్నారు. బిజెపి నాయకులు గల్లీలో ఒక మాట ఢిల్లీలో మరో మాటతో రోజుకొక మాట చెప్తూ బీసీలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే రిజర్వేషన్లను తేల్చాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల న్నారు. బిజెపికి బీసీల ఓట్లు కావాలంటే 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని జాజుల శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు కురాని బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్య తలను బీసీలకు అప్పగించా లని, బీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని మీ బాపు కేసీఆర్ తో ప్రకటింప జేయాల ని,అప్పుడే బీసీలు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారన్నారు. అసలు స్థానిక సంస్థల కోటాలో 34% ఉన్న రిజర్వేషన్లను 18 శాతానికి కుదించి బీసీలకు తీరని అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని, అలాంటి బీఆర్ఎస్ పార్టీని బంగాళా ఖాతంలో కలిపి, బీసీలకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చామ న్నారు. అలాగే బీసీలు అంటే చిన్నచూపు చూస్తున్న బిజెపి రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదిం పజేసి, గవర్నర్ కు పంపిన బీసీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి, 42% బీసీ బిల్లును ఆమోదింపజేయాలని, లేకుంటే తెలంగాణలో బిజెపిని మట్టి కరిపిస్తామని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య క్షులు బైరి రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డా. చిర్ర రాజు, తమ్మేలా శోభరాణి,మాదం పద్మజాదేవి, కాసగాని అశోక్ గౌడ్, డా. సంగాని మల్లేశ్వర్, వేముల మహేందర్, వల్లాల జగన్ గౌడ్, పంజాల మధు, తెల్ల కిషోర్, తెల్లా సుగుణ, బూర్గుల ప్రమోద, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *