HANUMAN TEMPLE : వరంగల్ పోచమ్మ మైదాన్ రోడ్డులోని శ్రీ ఆనంద భాష్పాంజనేయ స్వామి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం సామూహిక అనఘ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి-అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించారు. పూజ కార్యక్రమంలో కొక్కుల రాజేంద్రప్రసాద్, ఆలయ అర్చకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్