Sri Sharadha Temple : శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాల మూడో రోజు ఆయుష్య హోమం వరంగల్ నగరంలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శృంగేరి శారద పీఠాధిపతులు, ఉభయ జగద్గురువులు శ్రీ భారతి తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి అనుగ్రహ ఆశీస్సులతో జరుగుతున్న శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాల మూడవరోజు బుధవారం ప్రధానార్చకులు సంగమేశ్వర జోషి ఆధ్వర్యంలో అర్చకులు చంద్రశేఖర శర్మ , బలరాం మిశ్రా, సోమశేఖర శర్మ లు గోపూజ, సంకల్పం, గణపతి పూజ, పుణ్యవచనం అనంతరం విశేష అలంకరణతో శ్రీ శారద అమ్మవారికి శ్రీ శారద కల్పోక్త విశేష పూజలు చేశారు. రేణిగుంట్ల కుమారస్వామి_ కృష్ణకుమారి దంపతులు ఆయుష్య హోమం నిర్వహించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణం, మహా మంగళ హారతులు అనంతరం శ్రీ శారదా అమ్మవారినీ భక్తులు దర్శనం చేసుకున్నారు. వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాల చెందిన సుమారు 1500 మంది భక్తులు శ్రీ శారదా అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం జగన్మోహన్ శర్మ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో సుహాసినిలు లక్ష కుంకుమార్చన చేశారు. రాత్రి గజ్జెలరంజిత్ కుమార్ బృందం చేసిన పేరుని నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. శ్రీ శంకర సేవా సమితి సభ్యులు భక్తులకు సేవలు అందించారు.