ACP Nandiram nayak : వరంగల్ నగరంలో దొంగతనాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్ 80 ఫీట్ రోడ్డు, సెకండ్ బ్యాంక్ కాలనీ, శాంతినగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఏసిపి నందిరాం నాయక్, మట్టేవాడ సిఐ గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొని దొంగతనాల నివారణ జాగ్రత్తలపై ప్రసంగించారు, ఈ సందర్భంగా పోలీసులను కాలనీవాసులు సత్కరించారు, శాంతినగర్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ గోపి సందర్శించి కాలనీవాసులను అభినందించారు, ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బసవరాజ్ కుమారస్వామి, కాలనీ పెద్దలు మారుపాక సుధాకర్ రెడ్డి, వేణు, పొన్నం నాగరాజు, బుచ్చిరెడ్డి, అచ్చ మధు, సురేందర్, హరినాథ్, దామోదర్, రామస్వామి, లక్ష్మీనారాయణ, సారంగం , ధర్మేంద్ర, ఆడెపు రవీందర్, భయ్యా స్వామి, బుజ్జ ప్రభాకర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.