MLC Sripal Reddy : వరంగల్, హనుమకొండ జిల్లాల ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎం.ఏ.కే. తన్వీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, తాను కూడా ఎయిడెడ్ పాఠశాలలో హై స్కూల్ చదువులు పూర్తి చేశానని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు నెల జీతాలు ఆలస్యం అవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఆయన, ఆరోగ్య బీమా లేకపోవడం, పదోన్నతులు మరియు కంసాషనేట్ అప్పాయింట్‌మెంట్ల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడాన్ని తప్పుబట్టారు. సమస్యల పరిష్కారానికి తాను కట్టుబడి ఉన్నానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సమాల యాదగిరి ఆధ్వర్యంలో ప్రర్టీయూ ఏర్పాటైనదని, తాజాగా హనుమకొండ జిల్లాలో ప్రారంభమైన ప్రర్టీయూ భవనంలో ఈ మొదటి అభినందన కార్యక్రమం జరుగుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చొప్పునను సంవత్సరానికొకసారి పెంచేలా ప్రయత్నించాలని, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గత ఆరు సంవత్సరాలలో ఎమ్మెల్సీగా అందించిన మద్దతుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడెడ్ జేఏసీ నేతలు సీతా రామచారి, శ్రీధర్, శివకుమార్, సరళ పాల్గొన్నారు. వరంగల్, హనుమకొండ ప్రర్టీయూ నాయకులు ఎం. తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, తొట బిక్షపతి, శ్రీనివాస్, గఫార్, పి. శ్రీహరి హాజరయ్యారు. జేఏసీ సలహాదారు తిరునగరి నరేందర్, జేఏసీ కో-కన్వీనర్ బెల్లంకొండ పూర్ణచందర్ మాట్లాడారు