July 26, 2026

Shopping mall : దిలసుఖనగర్ లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

Shopping mall : 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది.

ఈ క్రమంలో దిలసుఖ్ నగర్ లో శాఖను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.

రిబ్బన్ కటింగ్ అనంతరం నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, దిలసుఖ్ నగర్ ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది. వారి ఆశీర్వాదాలతో ఈ మాల్ మరింత విజయవంతమవుతుంది” అని అన్నారు.

మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ:

• “ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యం” అని తెలిపారు.
• “మా స్వంత హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసి, వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నాం” అని పేర్కొన్నారు.

మాంగళ్య షాపింగ్ మాల్‌లో మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్స్, అలాగే వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేకమైన భారీ వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మాల్ ప్రారంభంతో దిలసుఖ్ నగర్ ప్రజలు ఇకపై పెళ్లి షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ ప్రాంతంలోనే నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు.

రూ.99 నుంచి ప్రారంభమై రూ.1 లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉండటంతో పాటు, మాంగళ్య ఒక సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది.

ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్, రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 10 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనుండగా, భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్రానికి కూడా విస్తరించనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన మాంగళ్య షాపింగ్ మాల్, పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ షాపింగ్ మాల్‌గా నిలుస్తోంది.
ప్రజలు తమ తమ శుభ కార్యక్రమం ఏది ఉన్న ఒకసారి మాంగళ్య షాపింగ్ మాల్ కు సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఒక నూతన షాపింగ్ ఒరవడి సృష్టించాలని డైరెక్టర్స్ కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *