Warangal Traffic : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమీపంలోని పాపయ్యపేట చమన్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇక్కడి ప్రాంతంలోని చెట్లు విపరీతంగా పెరిగి కొమ్మలు కరెంట్ తీగలకు తగులుతుండటంతో కార్పొరేషన్ అధికారులు ప్రొక్లెయినర్‌తో వాటిని తొలగించే పనులు చేపట్టారు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో వచ్చి పోయే వాహనాలకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పలువురు వేసవి కాలం నేపథ్యంలో ఉదయం మరమ్మతులు చేయిస్తే బాగుంటుందని కోరుతున్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్