Guru Purnima : ములుగు రోడ్డులోని వరద దత్త క్షేత్రంలో గురువారం గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆది గురువైన దత్తాత్రేయ స్వామికి విశేషమైన సుగంధ తైలాభిషేకం, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తుల ద్వారా ఉత్సవ విగ్రహానికి తైలాభిషేకం చేయించారు. దత్త హోమం, గురుదేవుల పాదుకా పూజ చేశారు. అనంతరం తీర్థ ప్రసాదం, అన్నదాన వితరణ చేశారు. అర్చకులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.