*సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే*
*ప్రజల నమ్మకానికి న్యాయం చేయగలిగే నాయకత్వమే మా పాలన యొక్క పునాది.*
Naini rajendar reddy : ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు *శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి* అన్నారు. బుధవారం రోజున నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తో కలసి 11 వ డివిజన్ రంగంపేటలో ఫాతిమున్నిసా మరియు 29 వ డివిజన రామన్నపేట లో టూంగుటూరి శ్రీదేవి కి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఈ రోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న శంకుస్థాపనలతో ప్రజల్లో విశ్వాసం బలపడుతోందని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు చిరకాల స్వప్నం నెరవేర్చడం నా బాధ్యత అని పేర్కొన్నారు. ఇది ఓటువేసిన ప్రజలకు రుణం తీర్చుకునే తరుణమని వారి ఆశల్ని వమ్ము చేయం చేయకుండా 3500 మంది పేదలకు ఇండ్లు అందించాల్సిన బాధ్యత నా భుజాలపై ఉందని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి అర్హుడికి ఇల్లు ఇవ్వాలన్నది నా ముఖ్య సంకల్పం అని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమలో గత పదేళ్లుగా జరగని అభివృద్ధి పనులను మేం వేగంగా పూర్తిచేస్తున్నామని రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, మౌలిక వసతులు వంటి ప్రాధమిక అవసరాలపై ప్రత్యేక దృష్టితో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామనీ అన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఎమ్మెల్యే వివరించారు.
అనంతరం : పోతన నగర్ ప్రాంతంలో వరద నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.75 లక్షలతో బాక్స్ కల్వర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి మౌలిక సమస్యకు సమాధానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. ప్రజల జీవన ప్రమాణం మెరుగుపరచడమే మా లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు. నాపై చూపిన విశ్వాసాన్ని వ్యర్థం చేయబోనని, ప్రతి ఓటును అభివృద్ధి పనిగా మలచే కృషి చేస్తున్నాం. ప్రజల ఆశయాలు నెరవేర్చేవరకు విశ్రమించంఅని ఎమ్మెల్యే నాయిని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. మరియు అధికారులు పాల్గొన్నారు.