కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు హామీ…
Naini rajender reddy : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పోచమ్మకుంటలో హనుమాన్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన స్వాగత తోరణం (అర్చ్) ను మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ వాసులు స్వచ్ఛందంగా కలసి చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రశంసనీయమని పేర్కొన్న ఎమ్మెల్యే, కాలనీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాలనీలో మౌలిక వసతుల సదుపాయాల కల్పన, రోడ్లు, నీరు, డ్రైనేజీ వంటి అంశాల్లో ప్రజా ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు తమ అభిమానం చాటుతూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాలనీ వాసులు, యువత, మహిళాలు,కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.