February 26, 2026

Sammakka Saralamma : ఉమ్మడి వరంగల్ జిల్లా కుంభ మేళా

Sammakka Saralamma : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుంభ మేళాను తలపించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రోజు రోజుకు లక్షలలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చేసింది. ఈసారి సుమారు రెండు కోట్లకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుం`టారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి, దేశాలనుంచి భక్తులు చేరుకొని నిలువెత్తు బంగారంతో మొక్కులు చేల్లించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రయాణికుల సౌకార్యార్థం వివిధ రాష్ట్రాల నుంచి 4 వేల ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా 15 వేల మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం గంగారం, పొనుగండ్ల నుంచి మేడారానికి పగిడిద్దరాజు చేరుకొన్నారు. బుధవారం గద్దెలపై సారలమ్మ కొలువుదీరనున్నారు. గురువారం సమ్మక్క గద్దెలపై రానున్నారు. ఈ క్రమంలో గద్దెల ప్రాంగణం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. జిల్లాలో దారులన్నీ మేడారానికి పయనమవుతున్నాయి. ములుగు గట్టమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇటు ములుగు నుంచి పస్రా , ఏటూరునాగారం వరకు రాకపోకలు స్తంభిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *