GWMC : వరంగల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఆసుపత్రి వద్ద చెత్త డంపు వాహనం నిలపడం వల్ల కంపు కొడుతున్నది. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతీ ఇంటి నుంచి సేకరించిన చెత్తతో పాటు, హోటల్స్, ఇతర షాపుల నుంచి వ్యర్ధమైన చెత్తను సేకరించి వాటిని డంపింగ్ యార్డుకు తరలించాలి.. కానీ మున్సిపల్ ప్రధాన కార్యాలయం ఎదుట రోడ్డుపై గంటల తరబడి ట్రాక్టర్ లను నిలబెడుతున్నారు. పక్కనే ఎమ్ జిఎమ్ ఆసుపత్రి ఉండటంతో అందులో ఎక్కడి నుంచో వచ్చిన రోగులు చికిత్స పొందుతూ ఉంటారు. ఇక్కడ ఈ ట్రాక్టర్లు ఉంచడం వలన వ్యర్ధమైన చెత్త దుర్వాసన భరించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు ప్రధాన రహదారి కావడంతో వచ్చి పోయే వాహన దారులకు చెడు దుర్వాసన రావడంతో ప్రయాణికులు ఇబ్బందికరంగా ఉందని పలువురు వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి రోగులతో పాటు నగర ప్రజలు కోరుతున్నారు.