Gold medals : అవోపా హనుమకొండ ఆధ్వర్యంలో ఆవోపా భవనంలో ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు బంగారు పతకాలను అందజేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం పాల్గొన్నారు. గ్రూప్ వన్ లో విజయం సాధించిన ముగ్గురు అభ్యర్థులకు, పదవ తరగతి నుండి పీహెచ్డీ వరకు వివిధ కోర్సులలో అత్యధిక మార్కులు పొందిన 61 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ఆవోపా మరియు డోనార్లచే అందజేయడం జరిగింది.