Arya Vysya Mahasabha : వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య ఆణి ముత్యాలు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితు నితీష్ జాయింట్ కలెక్టర్గా పుల్లూరి వైష్ణవి సిటిఓ గా దేవు నూరి వైష్ణవి ఎంపీడీవో గా సెలెక్ట్ అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఓసీలుగా జన్మించిన ఆర్యవైశ్యులకి ఇలాంటి ఉన్నత స్థానాలు పొందడం గర్వించదగ్గ విషయమని వారు నిరంతరం ప్రజాసేవకులై పనిచేయాలని వారి తల్లిదండ్రులను నిరంతరం గుర్తుంచుకోవాలని నిబద్దతతో నిజాయితీగా పనిచేసి ఉన్నత స్థానాలు పొందాలని వారు వారిని సన్మానం చేసి కోరారు వీరితోపాటు గోపాలస్వామి గుడి చైర్మన్ ఇరుకుల రమేష్ ధర్మకర్తలు రజనీకాంత్ వెంకటేశ్వర్లను సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఓలం సదాశివుడు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సొల్లేటి కళావతి సేవాదళ్ గౌరవ అధ్యక్షుడు పాల మురళీధర్ పుల్లూరు రఘుబాబు అనంతుల వీరేందర్ చిన్నాల సురేష్ పబ్బతి సత్యనారాయణ సత్యనారాయణ శోభన్ మిత్తింటి శ్రీనివాస్ రాజన్న వాసుదేవ్ అంజన్న సొల్లేటి కిషన్ దేవుని శంకర్ ఐదు వీరేష్ వారి దంపతులు పాల్గొన్నారు వీరితోపాటు ఈ కార్యక్రమంలో 200 మంది పాల్గొన్నారు.