Traffic rules must be followed : వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు హనుమకొండ ట్రాఫీక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత-ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన సదస్సు శుభం గార్డెన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటోడ్రైవర్ యూని ఫామ్ ధరించాలని, ఆటో నడపటానికి అవసరమైన పేపర్స్ కలిగి ఉండాలని, మద్యం తాగి ఆటో నడప వద్దని, ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని , ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పరిమితి కి మించి అధిక వేగం తో ఆటో నడపవద్దని, అధిక ప్రయాణికులతో ప్రయాణం చేయద్దని ,నిర్దేశించిన ప్రదేశం లోనే ఆటోలు పార్కింగ్ చేయాలని, ఏదైనా నేర సమాచారం ఉంటే అట్టి సమాచారాన్ని పోలీస్ వారికి తెలియ పరచాలని మరియు ట్రాఫిక్ పోలీస్ కి సహకరించి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి. సత్యన్నా రాయణ, ఏసిపి ట్రాఫిక్ వరంగల్ , జి. సీతా రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హనుమకొండ , ఎస్సై లు కొమురెల్లి , నారాయణ, సిబ్బంది మరియ 600 వందల మంది ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.