August 26, 2025

MLA Nagaraju : నేను నాయకుని కాదు.. మీ సేవకుడిని

MLA Nagaraju : వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళ వారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలే దని, నియోజకవర్గంలో అను వైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించు కొని పోయారు.దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజక వర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియా డుతూ కృతజ్ఞతలు తెలిపారు.


“మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప బహుమతి. ఇంటి గ్రేటెడ్ స్కూల్ ఇక్కడే వస్తుంద ని తెలిసి చాలా సంతోషంగా ఉన్నట్లు పట్టణ ప్రజలు తెలియజేశారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే నాగరాజు కి పట్టణ, మండల పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు అభినం దనలు తెలిపారు.వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకో వడం కోసం వర్ధన్నపేట పట్టణ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ మరియు మున్ఫిక్ కోర్టు, సబ్ డివిజన్, సబ్ జైలు పలు ప్రభుత్వ కార్యాలయాలు తీసుకు రావడం కోసం కృషి చేస్తున్నానన్నారు.స్థానిక దళిత,గిరిజన రైతులు భూము లు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ నా ప్రత్యేక కృత జ్ఞతలు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే నాగరాజు తెలియ జేశారు.గువ్వల బోడు ప్రాంతం పాఠశాల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉందని, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నా రు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమై, పాఠశాల విద్యార్థు లకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.వర్ధన్నపేట నియోజకవర్గం విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురాయిగా నిలవనుందని విద్యావేత్తలు అభిప్రాయపడు తున్నారు. ఆధునిక వసతుల తో కూడిన ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నా రు.200 ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *