Hydra Police Station : తెలంగాణ ప్రభుత్వ విశేష ప్రజాసేవా లక్ష్యాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బుద్ధభవన్‌లో హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తక్షణ స్పందనతో సమస్యల పరిష్కారం హైడ్రా ఏర్పాటైన తొలి దశలోనే బుల్కాపూర్ నాలా సమస్యను ప్రత్యేక అధికారాలతో ఒకే రోజులో పరిష్కరించడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని తెలిపారు. అలాగే దుండిగల్ ప్రాంతంలో రెండు చెరువుల మధ్య ఉన్న నాలా సమస్యను పరిష్కరించి స్థానికులకు ఊరట కలిగించడాన్ని కమిషనర్ ఘనంగా గుర్తించారు. విపత్తు నిర్వహణలో కీలక పాత్ర హైడ్రా విపత్తుల నిర్వహణలోనూ విశేషంగా పనిచేస్తోందని, ఇటీవల డీఆర్ఎఫ్‌లో ఉద్యోగాలకు తక్కువ మార్కులతో ఎంపిక కాకపోయిన అభ్యర్థులను అవకాశమిస్తూ నియమించడం ద్వారా సామాజిక న్యాయానికి కట్టుబాటు చూపించిందని తెలిపారు. పోలీసు స్టేషన్ ఏర్పాటుతో హైడ్రా అధికారిక శక్తిని మరింత బలోపేతం చేసుకుంది. భూఆక్రమణ వెనుక ఉన్న మూలకథలను వెలికితీసి, కఠిన చర్యలు తీసుకునే అవకాశాలను ఇది కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ భూముల రక్షణతో పాటు, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం హైడ్రా ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా హైడ్రా అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ