Play school : హనుమకొండ విజయపాల్ కాలనీలో వండర్ కిడ్స్ ప్లే స్కూల్ ను ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. 60వ డివిజన్ వడ్డేపల్లి పరిధిలోని విజయ్ పాల్ రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన వండర్ కిడ్స్ ప్లే స్కూల్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రారంభ చిన్నారుల భవిష్యత్తు బలపడాలంటే నాణ్యమైన ప్రాథమిక విద్య కీలకం అని, ఇలాంటి సంస్థలు నగర విద్యావ్యవస్థలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ పాతకోటి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని, ఇప్పటికే తమ ప్లే స్కూల్ లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో వండర్ కిడ్స్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ పాతకోటి శ్రీనివాస్ , సెక్రటరీ రమాదేవి, కార్పోరేటర్ లు దాస్యం అభినవ్ భాస్కర్, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.