Warangal Temple : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో వైభవంగా శాకాంబరీ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవారికి వైభవంగా వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ నిర్వహించారు. అనంతరం అర్చనలు, మహా మంగళ హారతి చేశారు. మాతృ మండలి సభ్యులు పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అనంతరం శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదం, అన్నదాన వితరణ చేశారు. అర్చకులు రాపాక గోపికృష్ణ శర్మ, ఆలయ ట్రస్ట్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Blog / జనరల్ / తాజా వార్తలు / లోకల్ న్యూస్