First edition of Marathon : గొప్ప చరిత్ర కలిగిన మహా నగరమైన వరంగల్ తొలిసారి మారథాన్ నిర్వహిస్తున్నామని నిర్వహకులు తెలిపారు. ఈ నెల 23న జరగనున్న ఆఫ్ మారథాన్ కి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని శుక్రవారం హరిత కాకతీయ హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో విష్ణు రెడ్డి ,మారథాన్ సభ్యులు తెలిపారు. రెండో అతిపెద్ద నగరంగా పేరొందిన వరంగల్ మహా నగరంలో ఈ నెల 23 వ తేదీన కాళోజీ కళాక్షేత్రం నుంచి నిర్వహించే హాఫ్ మారథాన్ విజయవంతం చేయాలని శుక్రవారం హనుమకొండ హరిత కాకతీయ నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణు వర్ధన్ రెడ్డి, మారథాన్ సభ్యులు మాట్లాడారు. క్రెడాయ్ వరంగల్ వారి సౌజన్యంతో తెలంగాణ రన్నర్స్,వరంగల్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే హాఫ్ మారథాన్ కార్యక్రమం గతంలో ఎప్పడు జరగలేదని చరిత్రగా విశిష్ట వారసత్వ సంపద కలిగిన మహా నగరంలో ఈ మారథాన్ ద్వారా మరింత ప్రాచుర్యం పొందవచ్చని అన్నారు. మొత్తం మూడు విభాగాలుగా మారథాన్ నిర్వహిస్తున్నామని ఒకటి 5 కిలోమీటర్లు , రెండు 10కిలోమీటర్లు మూడు 21.100 కిలోమీటర్లుగా విభజించి ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులుగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ మారథాన్ లో జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్, మునిసిపల్ కమిషనర్, ఎన్పీడీసీఎల్ చైర్మన్ ఇతర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. గతంలో రాష్ట్రంలో కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర జిల్లాలలో నిర్వహించిన క్రమంలో మన నగరంలో మొదటిసారి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతియేటా నిర్వహించాలని నిర్ణయించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఈ మారథాన్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మారథాన్ కు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మారథాన్ లో పాల్గొనే వారికి చీప్ ఏర్పాటు చేసిన దాని ద్వారా వారి రన్ టైమ్ గుర్తించడం జరుగుతుందన్నారు. మంచి వాతారణంలో ఈ మారథాన్ నిర్వహించేలా అన్నివిధాలా సౌకర్యాలు ఏర్పాటు చేశామని వెల్లండించారు. మారథాన్ నిర్వహణలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రంగా మొత్తం సహకరిస్తున్నారని వెల్లండించారు. ఇప్పటి వరకు 2600 మంది సభ్యులు ఈ మారథాన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నుంచి ఫారెస్ట్ ఆఫీస్,ఫాతిమా జంక్షన్,వడ్డేపల్లి,కాకతీయ యూనివర్సిటీ మీదుగా మళ్లీ కాళోజీ వరకు ఉంటుందని తెలిపారు. మారథాన్ లో పాల్గొని వారికి ప్రతి చోట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు,వైద్య సదుపాయాలు, మొబైల్ టాయిలెట్స్, ఎవ్ఎస్ఎస్, ఎన్ సీసీ వాలెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మారథాన్ ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే రన్నర్స్ వలన మన నగర కీర్తి మరింత బలోపేతం అవుతుందని, ఉదయం 5 గంటలకు 21.10 కిలోమీటర్ల రన్,6 గంటలకు 10 కిలోమీటర్ల రన్ ,7 గంటలకు 5 కిలోమీటర్ల రన్ ప్రారంభం అయ్యి జరిగిన 9 గంటల వరకు ముగుస్తున్నదని, తదనంతరం కాళోజీ కళాక్షేత్రం పక్కన ఉన్న హయగ్రీవాచారి మైదానంలో బహుమతుల ప్రదానం, ముఖ్య అతిథులుగా ప్రసంగాలు ఉంటాయని వేల్లందించారు. మారథాన్ నిర్వహణకు చాలా వరకు స్వచ్ఛందంగానే ముందుగు వచ్చి భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీడియా సమావేశ అనంతరం మారథాన్ పోస్టర్,,టీ షర్ట్ ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో మారథాన్ రన్నర్స్ జగన్ మోహన్ రెడ్డి,డాక్టర్ సుధాకర్,ఉదయ్ రెడ్డి,రవి,చరణ్,సరస్వతి,తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
