February 25, 2026

Collector Dr. Satya Sharada : మున్సిపల్ ఎన్నికల సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు నిర్వహణ..

Collector Dr. Satya Sharada : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు సమక్షంలో పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అనుసరిస్తూ ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టగా, కలెక్టర్, జనరల్ అబ్జర్వర్‌లు దానిని నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు మూడవ ర్యాండమైజేషన్ ద్వారా మొత్తం 80 మంది ప్రిసైడింగ్ అధికారులు, 80 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 240 మంది ఇతర పోలింగ్ అధికారులను కేటాయించారు. ఈ సందర్భంగా 17 మంది సూక్ష్మ పరిశీలకులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అదేవిధంగా 20 శాతం రిజర్వ్ సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా నోడల్ అధికారి నర్సింహ మూర్తి, ఎన్నికల డిటి రంజిత్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *