February 26, 2026

Warangal : వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వం

Warangal : తుఫాన్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వచ్చిన అధికారులు వీరితోపాటు వరంగల్ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎమ్మార్వో లు మిగీత అధికారులందరూ కూడా వీరితో పాల్గొనడం జరిగినది. వచ్చిన అధికారులతో పాటు 28 డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ సాయి నగర్ కాలనీ బృందావన కాలనీ ఎన్టీఆర్ కాలనీ సంతోష్ మాత కాలనీ లో తిప్పుతూ ఈ యొక్క బొంది వాగు నీటిని ఎక్కడ వరకు వచ్చినాయి ఎంతవరకు నష్టం జరిగిందని అధికారులతో చెప్పడం జరిగినది. ఈ విపత్తు నుండి కాలనీవాసులను దీని నుండితొందరగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలరని చెప్పడం జరిగినది. కొంతమంది కాలనీవాసులతో కూడా మాట్లాడడం జరిగినది. అలాగే మొన్న వచ్చిన విపత్తుకి ప్రభుత్వం నుంచి వచ్చిన 15 వేల రూపాయలు ఇంకా కొంతమందికి వచ్చేది ఉన్నది కొంతమందికి 15000 రూపాయలు రాలేదని కార్పొరేటర్ ను కలవడం జరిగినది. వారికి అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని కార్పొరేటర్ గారు తెలియడం జరిగింది. 15 వేల రూపాయలు పత్రిక ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయంపై కలెక్టర్ గారు కమిషనర్ గారు స్పందించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో బిజెపి రజక సెల్ జిల్లా కన్వీనర్ కొత్తపేల్లి రాజేష్ 28 డివిజన్ అధ్యక్షులు రామిని కృష్ణ సుమన్ శంకర్ సింగ్ నకాచారి రాము పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *