Bhadrakali Temple : భద్రకాళి దేవాలయమును తెలంగాణా రాష్ట్ర ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ శ్రీమతి చందా పండిట్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన శ్రీమతి చందా పండిట్ కి ఆలయ ఈఓ శ్రీమతి రామల సునీత ఘనస్వాతం పలికారు. పూజానంతరం శ్రీమతి చందా పండిట్ గారికి అర్చకులు, వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త శ్రీ అనంతుల శ్రీనివాసరావు, తహశీల్దార్ రవీందర్ దేవాలయ పర్యవేక్షకులు శ్రీ జి. క్రాంతికుమార్ తదితరులున్నారు. ఈ రోజు శ్రావణ మాసం చివరి శుక్రవారం కూడా కావడంతో భక్తులు దేవాలయమునకు పోటెత్తారు.