February 26, 2026

Consumer Rights Day : ప్రజల చైతన్యం తో వినియోగదారుల మోసాలకు చెక్

Consumer Rights Day : జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మరియు కాలేజ్ కన్జ్యూమర్ క్లబ్స్ కోఆర్డినేటర్ కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు మరియు పరిరక్షణ పై చైతన్య కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019″ ప్రజల చేతిలో ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని ఈ చట్టం గురించి అవగాహన కలిగి చైతన్యంతో ఉత్పత్తిదారుల మరియు పంపిన దారుల నుండి రక్షించుకోవచ్చని ముఖ్యంగా నాణ్యతక ,తూనికలు మరియు కల్తీ పదార్థాలను నుండి రక్షించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రతి ఉత్పత్తికి భారత ప్రామాణిక సంస్థ బీస్ ఒక లోగోను ఏర్పాటు చేయడం జరిగినదని ఆ మార్కు గల ఉత్పత్తులను తీసుకొని రక్షణ పొందాలని ఉదాహరణకు బంగారహాభరణాలు అయితే Hall మార్క్ ,ఆహార పదార్థాలు పానీయాలు అయితే AGMARK మార్క్, FSSAI. సిల్కు వస్త్రములు అయితే SILK Mark , ఫ్రిజ్జులు ఏసీలు అయితే ఏకో మార్క్ మిగతా అన్నిటికీ ISI మార్కుగల వస్తువులనే వాడి తగిన రసీదు పొంది నాణ్యత లోపాలు, తూకంలో గాని, కల్తీ జరిగిన సందర్భంలో సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారిపై తగును చర్యలు తీసుకునేందుకు సహకరించాలని, వినియోదారులు ప్రశ్నించే తత్వము అలపర్చుకున్నప్పుడే ఈ మోసాల నుండి రక్షించబడతామని ఫిర్యాదుల కొరకు 1915 గల టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఆన్లైన్ Online ద్వారా కూడా ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందచ్చని ఈ విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులకు మరియు యువత అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా వరంగల్ పట్టణం లోని హైస్కూల్ ,కళాశాల విద్యార్థులకు వ్యాసరచన మరియు వకృత్వ పోటీలు నిర్వహించి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిచే పథకాలు మరియు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కోడి మాల శ్రీనివాసరావు రూపొందించిన గోడ పత్రికను గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి మేడం, ఫుడ్ ఇన్స్పెక్టర్ ,లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్, డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ కృష్ణయ్య , క్యాట్కో రాష్ట్ర అధ్యక్షులు శంకర్ లాల్ చౌరాసియా, వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ఇండస్ట్రియల్ మేనేజర్ నరసింహమూర్తి , తదితరులు ఈ గోడపై పత్రికను ఆవిష్కరించి దీనిలోని సమాచార్ణాన్ని హాజరైన ప్రతినిధులకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *