ముందు మురిపించి..
Warangal District : రోహిణి కార్తెలో ముందస్తుగా మురిపించిన వానలు ఇప్పుడు ముఖం చాటేసాయి. 15 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓ భారీ వర్షం కూడా కురిసింది లేదు. దీంతో అన్నదాతలు వరుణ దేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు..
దుక్కులు దున్ని సిద్ధం..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పొలాలను దుక్కులు దున్ని సిద్ధం చేసుకుని ఉన్నారు. రోహిణి కార్తెల కురిసిన ముందస్తు వర్షాలతో కొంతమంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. అయితే మృగశిర కార్తి ప్రారంభం నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకెత్తె పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికైనా భారీ వర్షాలు కురవకుంటే పత్తి మొక్కలు పూర్తిస్థాయిలో మొలకెత్తి అవకాశం కనిపించడం లేదు. దీంతో మరోసారి విత్తాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఆర్థికంగా నష్టపోయి ప్రమాదం ఉంది.
జోరు పనులు..
భారీ వర్షాలు కురిస్తే గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దుక్కులు దున్ని సిద్ధంగా పెట్టుకున్న రైతులు భారీ వర్షం కురిస్తే నాట్లు వేసే అవకాశం ఉంటుంది దీంతో వ్యవసాయ కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది.