యోగ అనేది మానవతా సంపద…
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..
ఇది కేవలం ఆరోగ్యానికి కాదు ప్రశాంతతకు కూడా ఓక మార్గం..
Yoga Day : యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు, శరీరానికి,ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ మరియు ఆయుష్ విభాగం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డా కడియం కావ్యగారితో కలిసి పాల్గొన్నారు. శిక్షణ పొందిన యోగ నిపుణులతో ప్రత్యేకంగా యోగా ఆసనాలను నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని,యోగ అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. భారతీయ సంస్కృతికి యోగా చిరునామా అని అన్నారు. ప్రపంచమంతా మన సంప్రదాయలను ఆదరించే చేసిన ఆత్మీయ సాధన అని కొనియాడారు. ప్రతి రోజు యోగా చేయాలనే కోరిక ఉంటున్న కూడా రోజు దినచర్య వలన సమయం కేటాయించలేకపోతిన్నామని చెప్పారు. నగరంలో యోగ సెంటర్ ల పై అవగాహన కల్పించాలని నూతన యోగ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ప్రజలను ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి,జిల్లా వైద్యశాల అధికారి అప్పయ్య మరియు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి,సుగుణాకర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్,మాడిశెట్టి సతీష్ మరియు యోగ నిపుణులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.