Badibata Success : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బడిబాట కార్యక్రమం విజయవంతం అయింది. ఈనెల ఆరవ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంతో చేపట్టారు. పేద పిల్లలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ విద్యను అందిపుచ్చుకునేలా ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేశారు. చదువు మధ్యలో ఆపేసిన పిల్లలను సైతం గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో వందలాదిమంది నూతనంగా ప్రవేశం పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే వనగూరే ప్రయోజనాలు ఉచితంగా అందే సౌకర్యాల విషయంలో ఉపాధ్యాయులు గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రయత్నం బడిబాట కార్యక్రమం విజయవంతానికి తోడ్పడింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయులతో విద్య బోధన జరుగుతుంది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తుంది. యూనిఫాంలో సైతం ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది. మధ్యాహ్న భోజనం సైతం పాఠశాలల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు పాఠశాలల్లో చేరేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే మన ఊరే ప్రయోజనాలను ఉపాధ్యాయులతో పాటు గ్రామాల్లోని రాజకీయ పార్టీల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు సైతం తోడ్పాటు అందించడం బడిబాట కార్యక్రమం విజయవంతానికి తోడ్పడింది