చోటే చోర్ కి బడే చోర్ మద్దతు ఇవ్వడం హాస్యాస్పదం
బెదిరిస్తారు, దోచుకుంటారు, మోసం చేస్తారు అడిగితే జై తెలంగాణ ఉద్యమం పేరుతో ముందుకు వస్తారు.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కి ముఖ్యమంత్రికి సంబంధం ఉందా
అని మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని, రేవూరి
MLAs Naini Revuri : చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జై తెలంగాణ నినాదం ఎత్తడం సిగ్గుచేటని ఉద్యమాల పేరుతో ప్రజలను నాడు మోసం చేసి నేడు డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అన్నారు. శనివారం రోజున హనుమకొండ డీసీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాలించిన పదేళ్లలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు,దేశంలో అతిపెద్ద ఫోన్ టాంపరింగ్ చేసి నిజరాజకీయ తెరలేపారని మండిపడ్డారు.
దేశం కోసం పోరాడిన యోధుల మాదిరిగా చట్టాన్ని అపహాస్యం చేయడం సరికాదన్నారు. చేసిన పాపలపై అరెస్ట్ చేస్తే ఉద్యమం కార్డ్ అడ్డుపెట్టుకుని చెలరేగడం చాలా సిగ్గుచేటు అన్నారు. గతంలో ప్రజల పక్షాన నిలిచిన ప్రతిసారి అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో పెడితే ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా చట్టప్రకారంగా ఈ చీడపురుగులను శిక్షించాలని అధికారులను కోరారు. మీరు చేసిన తప్పులను చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. మీ పదేళ్ల పాలనకు ప్రజలకు పక్కన పెట్టిన,పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న వచ్చిన ఇసుమంతైనా సిగ్గులేదని అన్నారు. మిగిలిన ఎంపీ లు కూడా తమ అవినీతి బహిర్గతం కావొద్దనే నెపంతో పార్టీలో ఉన్నారని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పసునూరి దయాకర్,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.