August 28, 2025

MLA Yashasvini Reddy : కొడకండ్లలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ

లబ్ధిదారుల కండ్లలో నూతన ఉత్తేజం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

MLA Yashasvini Reddy : పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి స్వయంగా లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఇల్లు అనేది ప్రతి మనిషి కల. ఆ కలను సాకారం చేయడమే ఇందిరమ్మ హౌసింగ్ పథక లక్ష్యం. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచి, గృహ నిర్మాణానికి ఈ మంజూరు పత్రాలు అండగా ఉంటాయి. ఇదే చైతన్యంతో పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఇల్లు అందించాలన్నదే మా సంకల్పం. ప్రజల మద్దతుతో ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేస్తాం అని తెలిపారు..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *