Warangal Police Commissionerate : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు ధైర్యాన్ని కలిగించా టానికే, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిం చామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. శుక్ర వారం హన్మకొండ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్ని జెండా ఊపి ఈ కవాతు ప్రారంభించారు. హన్మకొండ బస్టాండ్, బ్రాహ్మణవాడ, అలంకార్ జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా అశోక జంక్షన్ వరకు ఈ కవాతు కొనసాగి నది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో చేపట్టి న ఈ కార్యక్రమం వరంగల్ పోలీస్ కమిషనరరేట్ పరిధిలో ఏడు రోజుల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కవాతు నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఎలాంటి అల్లర్లు, మత ఘర్షణ లు తలెత్తిన తక్షణమే స్పందించి స్థానిక పోలీసులకు సహకారం అందిస్తూ ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కవాతు నిర్వహిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఆర్. ఏ. ఎఫ్ డిప్యూటీ కామాండెంట్ సరస్వతి, హన్మకొండ ఏసీపీ నర్సింరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్ స్పెక్టర్లు సతీష్,రవికుమార్, సత్యనారా యణ రెడ్డి తో పాటు ట్రాఫిక్, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్