Warangal : కరీమాబాద్ జంక్షన్లో దసరా రోడ్డుకు వెళ్లే మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. పది రోజుల క్రితం మంచినీటి ప్రధాన పైప్ లైన్ మరమ్మతులు పనులను చేయించారు. కానీ ఇక్కడ రహదారిపై వాహనదారులు ఎక్కువగా వెళ్తుంటారు. రాత్రి వేళల్లో వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇక్కడి స్థానికులు మండిపడుతున్నారు. కావున అధికారులు స్పందించి తొందరగా పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు.