World tobacco day : ప్రపంచ తంబాకూ నిరోధక దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్స్ , స్లమ్ ఏరియా వాసులకు అవగాహన కల్పించిన. వరల్డ్ టొబాకో డే సందర్భంగా అనురాగ్ సొసైటీ, చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి మాట్లా డుతూ, తంబాకూ వాడకాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే పిల్లలను తంబాకూ పరిశ్రమల ప్రభావం నుండి రక్షించడం మన సమాజానికి అత్యంత అవసరం. తంబాకూ వాడకం వల్ల ప్రతి ఏడాదీ కోట్లాది మంది తమ ప్రాణాలను కోల్పోతు న్నారు, కాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఇది పూర్తిగా నివారించలేని రోగాలకు, మరణాలకు ప్రధాన కారణం,” అని తెలియజేశారు.తంబాకూ వాడకాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్య నిపుణులు, ఉపాధ్యాయులు మరియు ప్రతి పౌరుడు కలిసి కట్టుగా పనిచేయాలని, సమిష్టి కృషితో నివారణ సాద్యం అని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యత కూడా. తంబాకూ వాడకం వాడేవాళ్లకే కాకుండా వారి కుటుంబాలకు కూడా హాని కరం,”అని అన్నారు. అందరూ కలసి “తంబాకూ లేని సమాజం కోసం ప్రతిజ్ఞభూనాల్సిన అవసరం ఉందని, మన పిల్లలు పరిశుభ్రమైన వాయువును పీల్చి,ఆరోగ్యకరమైన అల వాట్లతో ఎదిగి, దీర్ఘకాల జీవితం గడపాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ