May 1, 2026

State Minister : మంత్రి కొండా సురేఖ ను సన్మానించిన శామంతుల శ్రీనివాస్…

State Minister : తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మనవడు శ్రేహన్షు పటేల్ గిన్నిస్ రికార్డు సాధించిన సందర్బంగా, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ,కాంగ్రెస్ వరంగల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో చెస్ లో ప్రపంచ మేధావి గా శ్రేయన్ష్ పటేల్ గిన్నిస్ రికార్డు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మహిళ నాయకురాలు రావుల విజయరాంచేందర్, పట్టూరి సుధాకర్, మధు,వెంకన్న,రాజు, రాధికా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *