సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని
పార్టీలకు అతీతంగా ఆరోగ్య పరంగా అండగా ఉంటానని భరోసా
2,848,600 ల విలువగల చెక్కులను 63 మంది లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
Hanamkonda MLA : ప్రజల ఆరోగ్యం కోసం పతాకంగా నిలిచిన సీఎం సహాయనిధి చెక్కులను పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ 28,48,600/- విలువైన చెక్కులు ,వరంగల్ మండలానికి చెందిన 5 మందికి రూ.5,00,580/-ల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికి అయినా ఊహించకుండా వస్తాయి. ప్రజలకు వెన్నంటే నిలిచి అండగా ఉంటుంది అని అన్నారు. ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు అనే భేదాలు ఉండవు. ఒక్క మనిషిగా చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం కోసం నేనెప్పుడూ అండగా ఉంటాను అని తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వేలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం పాల్గొన్నారు.