Shankara jayanthi : వరంగల్ ఎంజీఎం సమీపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శంకర జయంతి సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం గోపూజ, హోమం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన, శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. అర్చకులు ఎల్లంబట్ల లక్ష్మణ్ భక్తులకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు..