Admiring Indian team : విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జరుగుతున్న మొదటి టెస్టులో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. కెప్టెన్ గా గిల్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ తో చెలరేగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం సెంచరీ సాధించాడు. రిషబ్ పంత్ అర్థ సెంచరీ తో క్రీజులో ఉన్నాడు.
డబ్ల్యూటీసి ఫైనల్ తర్వాత..
ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఒకేసారి రిటైర్మెంట్ కావడంతో క్రికెట్ అభిమానులు కొంత ఆలోచనలో పడ్డారు. నూతన కెప్టెన్ గిల్ నేతృత్వంలో జట్టు ఇంగ్లాండ్ పర్యటన ఎలా ఉంటుందని ఆసక్తి నెలకొంది. అయితే అందరి ఆలోచనలకు భిన్నంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుంది. రెండో రోజు నేడు పూర్తిస్థాయిలో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగిస్తే ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం ఉండే అవకాశం ఉంటుంది.