August 27, 2025

Warangal Commissionerate : డ్రగ్స్‌ రహిత సమాజం నుండి తరిమి కొట్టేందుకు మనందరి లక్ష్యం

Warangal Commissionerate : డ్రగ్స్‌ రహిత వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని డ్రగ్స్‌ వ్యతిరేకంగా , ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొం దించిన వాల్‌పోస్టర్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం అవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ మత్తుపదార్థాలను ఈ సమాజం నుండి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కర పౌరుడు భాగస్వాములు కావడంతో పాటు పోలీసులుకు పూర్తి సహకారం అందించాలని. ఈ వారోత్సవారలను పురస్కరించుకోని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అన్ని వర్గాల ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటి వినియోగం ద్వారా నష్టాలపై ప్రజలకు పోలీసుల వివరించడం జరుగుతోందని. ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ ప్రవైయిట్‌ పాఠశాల్లో ఈ డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్‌, వ్యాస రచన పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతొందని. ఎవరైన మత్తు పదార్థాలు వియ్రించిన, వినియోగించిన తక్షణమే 8712584473 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని, సమచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమములో అదనపు డిసిపి రవి, సిసిఆర్‌బి ఎసిపి డేవిడ్‌రాజు, ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *