Vande Bharath : తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ స్లీపర్ రైళ్ళు
* రూటు మ్యాప్ పై కసరత్తు చేస్తున్న రైల్వే శాఖ
తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. సరికొత్త టెక్నాలజీ తో రూపు దిద్దుకుంటున్న వందే భారత్ రైళ్లు పట్టలెక్కుందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు కేటాయించేందుకు రైల్వే శాఖ సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతున్న సందర్భంలో వందే భారత్ స్లీపర్ రైళ్లపై ప్రయాణికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 9 రైళ్ళను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించగా అందులో రెండు రైళ్ళను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా నిర్ణయించినట్టు సమాచారం. ఏ రూట్లలో నడపాలో ఇంకా స్పష్టత లేదు రైల్వే వర్గాలు మాత్రం సికింద్రబాద్ నుండి ఢిల్లీ, మరోటి విజయవాడ నుండి అయోధ్య నడిపేందుకు కసరత్తు జరుగుతోంధని విశ్వసనీయ సమాచారం.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్