MLA Kr Nagaraju : హాసన్పర్తి మండల పరిధిలోని మడిపల్లి గ్రామ నాయకులు రైతులు ధర్మసాగర్ నుంచి వచ్చే ఎర్రి కాల్వ మరమ్మత్తులు చేయించాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి జెసిబి సహాయంతో కెనాల్ కాల్వ మరమ్మతు పనులను చేయించారు. మడిపల్లి గ్రామ రైతులకు ఎర్రి కాల్వ ద్వారా వచ్చే నీటికి సమస్య లేకుండా మరమ్మతులు చేపిస్తున్నందుకు గ్రామ నాయకులకు రైతులు ఎమ్మెల్యే నాగరాజు కు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.