⇒ పి వి తెచ్చిన సంస్కరణలు దేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టం చేసాయి.
⇒ తొలి తెలుగు ప్రధానిగా పి వి కి ప్రత్యేక స్థానం.
⇒ నాడు ఎంపీ గా పోటీ చేసిన పీవీ నరసింహా రావు గారి హయాంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది అని పీవీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నాయిని అన్నారు.
P. V. Narasimha Rao Jayanthi : మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ రజనీతుజ్ఞుడు స్వర్గీయ పీవీ నరసింహ రావు 104 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీవీ నర్సింహారావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులతో కలిసి నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అనంతరం హనుమకొండ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పీవీ ఆలోచనలు, ఆయన ఆర్థిక‑పార్టీ‑భారత రాజకీయ రంగాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు మన దేశాన్ని అభివృద్ధి మార్గంపైకి తీసుకెళ్లాయి. ఒక తెలుగువాడిగా దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన తొలి ప్రధామంత్రి గానే తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇవి భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికలో నిలిచేలా గ్లోబల్-ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. మన ప్రాంత బిడ్డ అయినా పీవీ నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న క్రమంలో వారి నాయకత్వంలోపనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ వి శ్రీనివాస్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,మునిసిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్,లక్ష్మారెడ్డి,రాజు,అంకుష్ మరియు ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు.