DR Kadiyam Kavya : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కు సమ ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా పాలన కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. భూపాలపల్లి మండలం మంజూర్ నగర్, చిట్యాల మండలం నవాబుపేట , ఘనపురం మండలం ధర్మా రావుపేటలో నూతనంగా నిర్మించనున్న మూడు విద్యుత్ సబ్ స్టేషన్లుకు శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్ర మార్క ,ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు , స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చడమే అందుకు నిదర్శనమని తెలి పారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, పేద బడుగుబలహీన వర్గాల ప్రజలకు ప్రతీ ఒక్కరికి సమ ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం పంపిణీ, పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని వెల్లడించారు.
గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆరఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. భూపాలపల్లి లో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అలాగే జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి మంత్రులు బట్టి విక్రమార్క , శ్రీధర్ బాబు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే సూచనల మేరకు నియోజకవర్గ అభి వృద్ధికి ఎంపీ నిధులు కేటాయి స్తానని తెలిపారు. రానున్న రోజులలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని,అంబేద్కర్ ని అవమా నించే బీజేపీ నుండి దేశానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలను, మహిళలను, చిన్నపిల్లలను అణచివే యాలని మోడీ, అమిత్ షా చూస్తున్నారని ఆరోపించారు.
ఆపరేషన్ సిందూర్ ఎందుకు మెదలు పెట్టారో,ఎందుకు ఆపేసారో తెలియదని, అమెరికా ప్రెసిడెంట్ చెబితే యుద్ధం ఆపే దుస్థితిలో ఉన్నామని అన్నారు. మన దేశాన్ని మనమే కాపాడు కోవాలని అందుకు రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే ఏకైక మార్గమని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి, టిస్ ఎన్పిడిసిల్ సీఎండి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.