MLA Kadiyam Srihari : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు అని, నియోజక వర్గా నికి కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులకు సూచిం చారు. జనగామ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్ (స్థానిక సంస్థలు), రోహిత్ సింగ్ (రెవెన్యూ) లతో కలిసి సంబంధిత అధికారు లతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 274 ఇండ్ల ప్రగతిని సమీక్షించారు. అలాగే రెండవ విడతగా ఐదు మండలాలలో 2212 ఇండ్లకు మంజూరు పత్రాలు అంద జేయగా 1029 ఇండ్లకు మార్కింగ్ ఇవ్వడం జరిగింద న్నారు. ఇండ్ల నిర్మాణాలలో అధికారులు లబ్దిదారుని కి అండగా ఉంటూ వెన్నంటి ప్రోత్సహించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిలో స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఇండ్ల నిర్మాణాలను వేగవంతంచేయిస్తామని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిర్మాణా లలో వచ్చే సమస్యల ను వెనువెంటనే పరిష్కరిం చేందుకు చర్యలు తులుసుకోవాలని అన్నారు.
లబ్దిదారులతో నేరుగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా సహకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఇది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం గ్రామాలలోని గ్రామ పంచాయతీ లో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి సాధించని ఇండ్ల పురోగతి పై దృష్టి పెట్టి,కొంత సమయం ఇస్తూ, అవసరమైతే సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు.
వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇల్లు త్వరితగతిన నిర్మించు కునే విధంగా లబ్దిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే లబ్ధిదారులకు జాప్యం లేకుండా వెంట వెంటనే బిల్లులు చెల్లించాలని సూచిం చారు. ఆర్థికంగా వెనకబడిన వారిని గుర్తించి వారికీ మహిళా సంఘాలు, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేయాలని అన్నా రు. ఈ నెల 25న మళ్ళీ మీటింగ్ ఉంటుందని అప్పటి లోగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓ డిఎస్. వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ లు సుహాసిని, హనుమంత నాయక్, హౌసింగ్ పిడి మాతృ నాయక్, డిఈ చంద్ర శేఖర్, హౌసింగ్ ఏఈలు ఎంపిడి వోలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.