Rain : వరంగల్ నగరం లో భారీ వర్షం
వరంగల్ హనుమకొండ కాజిపేటలో సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఉదయం నుండి తీవ్రమైన ఎండ ఉక్కపోత తో ఇబ్బంది పడ్డ ప్రజలకు సాయంత్రం ఉపశమనం కలిగింది. కాకపోతే ఒకేసారి వాతావరణం మార్పుతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది